Telangana History Ikshwakulu తెలంగాణ ఇక్ష్వాకులు చరిత్ర

0

Telangana History Ikshwakulu: ఎక్సామ్  డేస్ టీమ్ మీ కోసం మన భారత దేశ చరిత్రను తెలుగులో తీసుకుని రావడానికి ఒక చిన్న ప్రయత్నం మేము చేస్తునము, కావున అబ్యర్డులు కింద ఇవ్వబడిన ఇక్ష్వాకుల చరిత్ర గురించి పాయింట్ గా షార్ట్ ఇన్ఫర్మేషన్ తో చదువుకోగలరు. కొన్ని ముక్యమైన అంశాలు ఇక్ష్వాకుల గురించి, ఈ క్రింద పాయింట్ గా ఇవ్వబడ్డాయి.

మేము తీసుకోస్తున్న ఏ అంశాలు కేవలం TSPSC మరియు APPSC పోటీ పరీక్షలకు ఎంత గానో ఉపయోగపడతాయి.  

Telangana History Ikshwakulu

Candidates who are looking for the Telangana history books, they have to check these Telugu medium history material, which helps for the candidates in the examination.

ఇక్ష్వాకుల గురించి ముక్యమైన అంశాలు;

ఇక్ష్వాకుల స్థాపకుడువాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
ఇక్ష్వాకులశిల్పకళ  ఆకుపచ్చని రాతిపై శిల్పాలు, మందాత శిల్పం
ఇక్ష్వాకుల చివరివాడు  రుద్రపురుష దత్తుడు
ఇక్ష్వాకుల చిహ్నం సింహం
ఇక్ష్వాకుల రాజలాంఛనం హారతీ పుత్రులు
ఇక్ష్వాకుల రాజధాని విజయపురి
ఇక్ష్వాకుల పరిపాలన కాలంసుమారు 100 సం.లు
ఇక్ష్వాకుల  రాజభాష ప్రాకృతం
ఇక్ష్వాకుల మతం వైష్ణవం, బౌద్ధమతం
 ఇక్ష్వాకుల శాసనాలు నాగార్జున కొండ, అమరావతి
ఇక్ష్వాకుల గొప్పవాడువీరపురుష దత్తుడు

ఇక్ష్వాకులు చరిత్ర

కాలాల వారీగా ఇక్ష్వాకుల రాజుల సమాచారం

Total four (4) kings are ruled kingdoms: Ikshwakulu, total of 100 years their ruling years upon 4 kings.

  • First King – వశిస్థిపుత్ర శాతకర్ణి (క్రీ.శ.220-233)
  • Second King – మఠరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు  (క్రీ.శ.233-253)
  • Third King – ఎహువల శాంతమూలుడు  (క్రీ.శ.253-277)
  • Last King – రుద్రపురుషదత్తుడు (క్రీ.శ.283-301)

వశిస్థిపుత్ర శాతకర్ణి (క్రీ.శ.220-233)

  • శాతకర్ణి స్వతంత్ర ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు 
  • పూగియ, హిరణ్యక వంశీయులతో కలిసి శాతవాహన రాజు 3వ పులోమావిని తొలిగించి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు
  • శాతకర్ణి భార్య మఠారిశ్రీ, కూతురు అటవి శాంతిశ్రీ, కుమారుడు వీరపురుష దత్తుడు, సోదరిణులు శాంతశ్రీ, హార్మశ్రీ.
  • శాతకర్ణికి ‘మహారాజ’ అనే బిరుదు కలదు, ఇంకా శతసహస్త్రదానప్రదాత అనే బిరుదు పొందాడు 
  • శాతకర్ణి వైదిక మతాన్ని ఆచరించాడు 
  • శాతకర్ణి అనేకమైన శాసనాలు వేయించాడు(రెంటాల, దాచేపల్లి, కేశానాపల్లి)

మఠరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు (క్రీ.శ.233-253)

  • వీరపురుషదత్తుడు శాంతమాలుడు కుమారుడు, తలి పేరు మాధురి 
  • నాగార్జునకొండ శాసనాన్ని అనుసరించి ఇతనికి 5గురు భార్యలు ఉన్నారు
  • వీరపురుషదత్తుడు తన మేనత్త హార్మశ్రీ ఇద్దరి కూతుళ్లను (బాపిశ్రీ, షష్ఠిశ్రీ ) వివాహమాడాడు ఇంకా ముగ్గురు భార్యల పేర్లు: బట్టీ మహాదేవి, రుద్రా భట్టారిక, శాంతశ్రీ.  
  • వీరపురుషదత్తుడు మొదట్లో వైదిక మతాన్ని అనుసరించాడు తరువాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు 
  • నాగార్జునకొండలోనే ఒక శిల్పంలో రాజు తన కుడి కాలుతో ‘శివలింగాన్ని’ తాకుతున్నట్లు ఉంది 
  • వీరపురుషదత్తుడు కాలంలో ‘ఉపశక బోధిశ్రీ’ అనే మహిళ బౌద్ధమత వ్యాప్తికి కృషిచేసింది 
  • శాసనాలు: అల్లూరిశాసనం, ఉప్పుగుండూరు శాసనం, నాగార్జునకొండ శాసనం, అమరావతి శాసనం, జగ్గయ్యపేట శాసనం. 

ఇక్ష్వాకులు హిస్టరీ ఇన్ తెలుగు

ఎహువల శాంతమూలుడు (క్రీ.శ.253-277)

  • శాంతమూలుడుని రెండవ శాంతమూలుడు అంటారు 
  • తాతపేరు పెట్టుకునే సంప్రదాయం ఇక్ష్వాకుల నుంచే మొదలైంది. 
  • శాంతమూలుడు కాలంనుంచే శాసనాలు “సంస్కృతం” లో చెక్కబడ్డాయి 
  • శాంతమూలుడు దక్షిణభారత దేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొట్టమొదటి రాజు 
  • అప్పట్లో మహిళలు సంతానం కొరకు “హరిత దేవత” కు గాజులు సమర్పించేవారు 
  • ఇటీవల కాలంలో “గుమ్మడూరు” వద్ద ఎహువల శాంతమూలుడు యొక్క శాసనం లభించింది దీనిలో బౌద్ధ విద్యాలయానికి సంబందించిన వివరాలు ఉన్నాయి. 

శాంతమూలుడు నిర్మించిన దేవాలయాలు

  • హారతి దేవాలయం 
  • నందికేశ్వర ఆలయం 
  • పుష్పభద్ర నారాయణస్వామి దేవాలయం (విజయపురిలో)
  • కార్తికేయని దేవాలయం (విజయపురిలో)
  • నవగ్రహ ఆలయం (నాగార్జున కొండలో) 
  • కుబేర ఆలయం (నాగార్జున కొండలో) 

రుద్రపురుషదత్తుడు (క్రీ.శ.283-301)

  • రుద్రపురుషదత్తుడు కాలంలోనే తోలి పల్లవ రాజులూ ఇక్ష్వాకుల రాజ్యంపై దాడులు చేసారు 
  • దీని గురుంచి సింహవర్మ వేయించిన “మంచికల్లు శాసనం” లో పేర్కొనబడింది . ఇది ఆంధ్రదేశంలో పల్లవుల తోలి శాసనం 
  • ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ మంచి వర్తక కేంద్రంగా అభివృద్ధి చెందింది 
  • శ్రీలంక రాజులూ వారి బౌద్ధ సన్యాసుల కోసం ‘నాగార్జున కొండ’ వద్ద ‘సింహళ విహారము’ ను నిర్మించారు 
  • నాగార్జునకొండ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం గా మారింది 
  • రుద్రపురుషదత్తుడు కాలంలో సంగమ వంశం కు చెందిన ‘విరుగల్’ అనే సంప్రదాయం మొదలైంది 
  • విరుగల్ అంటే ‘రాజు కోసం జీవించి రాజు కోసం మరణించే అంగరక్షకులు’
  • వీరి కాలం నుంచే శాసనాలపై సంవత్సరాలు ప్రస్తావించే సంప్రదాయం మరియు నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కడం ప్రారంభమైంది 
  • వృత్తిపన్ను విధించబడినట్లుగా ‘విషవత్తి శాసనం’ ద్వారా తెలుస్తుంది. 

ఇక్ష్వాకులు హిస్టరీ ఇన్ తెలుగు

ఇప్పటి వరకు పైన పేర్కొన్న సమాచారం కేవలం అబ్యర్డుల పరీక్ష అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది, మరింత సమాచారం కోసం మీ దగ్గర ఉన్న స్టాండర్డ్ బుక్స్ ని ఫాలో అవ్వండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.